Homeఆంధ్రప్రదేశ్సాతులూరు సమీపంలో ఘోర ప్రమాదం

సాతులూరు సమీపంలో ఘోర ప్రమాదం

రాంగ్ రూట్‌లో వచ్చి ఆరు బైక్‌లను ఢీకొట్టిన మినీ లారీ

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 02:

నాదెండ్ల : గుంటూరు – కర్నూలు జాతీయ రహదారిపై గురువారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో అతివేగంతో వచ్చిన ఒక అశోక్ లేలాండ్ మినీ లారీ బీభత్సం సృష్టించింది. సదరు వాహనం రాంగ్ రూట్ (తప్పుడు మార్గం) లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ఆరు ద్విచక్ర వాహనాలను ఒకదాని తర్వాత ఒకటిగా బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన మినీ లారీ రహదారిపైనే బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బైక్‌లపై ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular