Homeఆంధ్రప్రదేశ్పోలవరంపెట్రోల్ బంకులపై అర్ధరాత్రి అకస్మాత్తు తనిఖీలు

పెట్రోల్ బంకులపై అర్ధరాత్రి అకస్మాత్తు తనిఖీలు

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 28:

చింతూరు మండలంలో పెట్రోల్ బంకులపై అర్ధరాత్రి అకస్మాత్తు తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలను చింతూరు ఏఎస్పీ బి. హేమంత్ కుమార్, ఎస్ఐ సంతోష్ కుమార్ చేపట్టారు. తనిఖీల సందర్భంగా పెట్రోల్, డీజిల్‌కు ఎటువంటి కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. బంకుల్లో నిల్వ ఉన్న ఇంధన స్టాక్‌ను పరిశీలించడంతో పాటు సంబంధిత రికార్డులను కూడా సవివరంగా తనిఖీ చేశారు. ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని పెట్రోల్ బంక్ యజమానులు, సిబ్బందికి అధికారులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular