ePaper
Sunday, April 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడబాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 5:
డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా రామచంద్రపురం పట్టణం, కాజులూరు, కె. గంగవరం మండలాల్లో ఘనంగా నివాళులర్పించారు. కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, అక్కల రిశ్వంత్ రాయ్, పోలిశెట్టి చంద్రశేఖర్ పాల్గొని వివిధ ప్రాంతాల్లో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular