ePaper
Thursday, April 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమంజేరులో అభినందన సభ – ఐదేళ్ల అభివృద్ధిపై ప్రశంసలు

మంజేరులో అభినందన సభ – ఐదేళ్ల అభివృద్ధిపై ప్రశంసలు

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 02:

కాజులూరు మండలంలోని మంజేరు గ్రామంలో గ్రామాభి వృద్ధికి సర్పంచ్ గుంటూరి అప్పారావు ఐదేళ్లుగా చేసిన సేవలకు గుర్తింపుగా గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. సర్పంచ్ గుంటూరి అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పంచాయతీ సెక్రటరీ ఎస్.శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించిన ఈ సభలో గత ఐదేళ్లలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్తులు ప్రశంసించారు.

మౌలిక వసతుల మెరుగుదల,డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్యం,తాగునీటి సదుపాయాల కల్పన వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అప్పారావును సచివాలయం సిబ్బంది,వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.తన పదవీకాలంలో సహకరించిన వార్డు సభ్యులు,అధికారులు,గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని,అందరూ కలిసి పనిచేస్తేనే గ్రామం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల వెంకటేశ్వరరావు, పుణ్యమంతుల శివాజీ,గండి బాబ్జీ, రాఘవ లోవ ప్రసాద్, కోరుకొండ ప్రసాద్, గుంటూరి ప్రసాదరావు,దోణం గణేష్, దోణం వెంకటరమణ,వినకోటి ప్రసాద్, కోరుకొండ వెంకటరమణ,సచివాలయ సిబ్బంది,వీఆర్వో మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular