ePaper
Saturday, April 4, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంరెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

రెవెన్యూ సేవల్లో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

 

ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

గంగవరం/ రాజవొమ్మంగి పెన్ పవర్, ఏప్రిల్ 4: రైతుల భూ-ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. శనివారం రాజవొమ్మంగి మండలం పాకవెల్తి గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, గత ప్రభుత్వ కాలంలో పట్టాదారు పాసుపుస్తకాలపై వ్యక్తిగత ఫోటోలు ముద్రించడం అనుచితమని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల హక్కులను కాపాడేందుకు రీ-సర్వే నిర్వహించి, పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ రాజముద్రతో ఈ-పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో 34 మంది రైతులకు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.భూముల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేసి రైతులకు అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇంకా రీ-సర్వే పూర్తి కాని గ్రామాల్లో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందని, రైతులు దానిని వినియోగించుకోవాలని సూచించారు.గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ.4.92 లక్షలతో మరమ్మత్తు పనులు చేపడతామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం అస్సలు వద్దు.

అనంతరం లోదొడ్డి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజలు సమర్పించే ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.అధికారులు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, తమ పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పరిష్కారం సాధ్యం కానప్పుడు కారణాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రజా దర్బార్‌లో దరఖాస్తులు సమర్పించే వారు ఆధార్, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, ఏ ఎం సి చైర్మన్ లోతా లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్, మండల ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, మాజీ ఎంపీపీ రెడ్డి రమణ, సీనియర్ నాయకులు గణజాల తాతారావు తదితరులు, అలాగే తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, ఎంపీడీవో లోకుల యాదగిరీశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular