ePaper
Wednesday, May 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంమీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో గిరిజన రైతులకు పట్టాల పంపిణీ

మీ భూమి – మీ హక్కు కార్యక్రమంలో గిరిజన రైతులకు పట్టాల పంపిణీ

📰 Generate e-Paper Clip

గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4:
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు పంచాయితీ పరిధిలోని చీడిపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం కింద గిరిజన రైతులకు రాజముద్రతో కూడిన భూమి పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రీ సర్వే పూర్తయిన రైతులకు ప్రతి నెలా పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చీడిపాలెం గ్రామంలో మొత్తం 84 మంది గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా రీ సర్వే పూర్తి కాని భూములను వేగవంతంగా సర్వే చేసి, అర్హులైన రైతులకు కొత్త పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.రీ సర్వే పూర్తైన భూముల వివరాలను సక్రమంగా నమోదు చేసి, రైతులకు పారదర్శకంగా హక్కులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడకం వెంకటరమణ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, పీసా ఉపాధ్యక్షులు మడకం శివ, సత్యనారాయణ, ఆర్‌ఐ లక్ష్మణరావు, వీఆర్‌వో సారపు వెంకన్నదొర, వీఆర్‌ఏ ప్రకాష్, గ్రామ పెద్దలు, పట్టా రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular