ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ నేతల కుటుంబ సభ్యులను నీచంగా దూషించడాన్ని అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి. అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు. నాగార్జున ఆధ్వర్యంలో బాపట్ల గడియార స్తంభం సెంటర్ వద్ద జరిగిన నిరసనలో అశోక్ కుమార్ పాల్గొన్నారు. మీడియా ముసుగులో నేతల భార్యలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాధాకృష్ణ వక్రబుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు
వైఎస్ఆర్సీపీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు.. బాపట్లలో భగ్గుమన్న శ్రేణులు
RELATED ARTICLES

