వైయస్ జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం, పెన్ పవర్ :
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమాశంకర్ గణేష్ ను ఆయన సాదరంగా ఆహ్వానించి, ప్రత్యేకంగా కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. నర్సీపట్నం పరిస్థితులపై ఆరా తీశారు. అయ్యన్నపాత్రుడు కడుతున్న సృష్టి క్షేత్రం పై వివరాలను జగన్మోహన్ రెడ్డికి వివరించారు. కోర్టులో సృష్టి క్షేత్రంపై స్టే తీసుకురావడంపై గణేష్ ను అభినందించారు. న్యాయపరమైన అంశాలపై పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ధైర్యంగా ముందుకు సాగాలని గణేష్ కు భరోసా ఇచ్చారు.

