ePaper
Monday, April 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడసాగు నీటి సంఘాల బాధ్యత”పై అవగాహన సదస్సు

సాగు నీటి సంఘాల బాధ్యత”పై అవగాహన సదస్సు

కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 6:
 

“నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే అంశంపై 100 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాజులూరు మండల కార్యాలయ మీటింగ్ హాల్‌లో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి వినియోగంలో పొదుపు పాటించడం,నీటి భద్రతను కాపాడడంలో సాగు నీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

అందుబాటులో ఉన్న నీటిని వృథా చేయకుండా, చివరి ఆయకట్టు రైతు వరకు సమర్థవంతంగా నీరు చేరేలా చూడటం సంఘాల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.సదస్సులో మండల స్థాయి కమిటీ ఏర్పాటు చేయబడింది. ఇందులో ఎంపీడీవో జె.రాంబాబు చైర్మన్‌గా ఉండగా, వ్యవసాయ అధికారి అశోక్ ,, ఏపీవో బి.వెంకటలక్ష్మీ (ఉపాధి హామీ), పశుసంవర్ధక శాఖ అధికారి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సభ్యులుగా, అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు మరియు సాగు నీటి సంఘాల ప్రతినిధులు భాగస్వాము లయ్యారు.అలాగే గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని, 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు 10 రోజుల వ్యవధిలో భూగర్భ జలాల పెంపుకు అవసరమైన పనులను గుర్తించాలని సూచించారు.ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ ఎంపీడీఓ జె.రాంబాబు, మండల వ్యవసాయ అధికారి వి.అశోక్,  ఏఈ ఇరిగేషన్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు కృష్ణ చైతన్య, ,సాగు నీటి సంఘాల అధ్యక్షులు తాడి రామారెడ్డి,సలాది శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు సీ హెచ్ సూర్య ప్రకాష్,కె.ఈశ్వరి,కె.వి రవి ప్రసాద్ శివకుమార్ మార్,బి.హేమాదే,పి.సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular