సృష్టిక్షేత్రానికి ఆటంకాలు సృష్టించవద్దు
-టిడిపి అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద చెరువు వద్ద నిర్మించనున్న సృష్టి క్షేత్రం ప్రాజెక్టుకు పదేపదే ఆటంకాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సృష్టి క్షేత్రానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిరాటంకంగా నిర్మాణం జరగాలని కోరుతూ వేములపూడి శివాలయంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి లాలం శ్రీరంగస్వామి, ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలం శ్రీరంగస్వామి మాట్లాడుతూ నర్సీపట్నం ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అడ్డుకోవడం దారుణమన్నారు. నర్సీపట్నం ప్రజలందరూ ఈ సృష్టి క్షేత్రాన్ని పూర్తిచేయాలని ఆశిస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు మాత్రం కోర్టును ఆశ్రయించి ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ఈ సృష్టి క్షేత్రం పూర్తయితే ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఎంతోమంది చిరు వ్యాపారులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన 108 అడుగుల ఈ శివపార్వతుల విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవాలని, అడ్డుకునే వ్యక్తుల మనసు మారాలని ఈరోజు శివాలయంలో పూజలు అభిషేకాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్టపాలెం మాజీ సర్పంచ్ కూండ్రపు అర్జున్, లాలం గోవిందు, పైల గంగాధర్, కూండ్రపు సన్నిబాబు, రొత్తల గణపతి సత్యనారాయణ, జి. సహదేవుడు, అనిమిరెడ్డి రమణ, పైల కొండబాబు, నక్కా వేమేష్, చింతల అప్పలనాయుడు, కూండ్రపు కన్నాలనాయుడు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

