ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మద్యం మత్తులో కారు బీభత్సం

మద్యం మత్తులో కారు బీభత్సం

📰 Generate e-Paper Clip

చిన్నారికి గాయాలు, మధురవాడలో ఉద్రిక్తత

మధురవాడ, పెన్ పవర్ ఏప్రిల్ 06:

నగరంలోని మధురవాడ పరిధిలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కాలనీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. ఐటీ సెజ్ రోడ్డుపై నుంచి వేగంగా వచ్చిన కారు, నియంత్రణ కోల్పోయి అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఘటనలో ఒక చిన్నారి గాయపడగా, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటనను గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీయగా, కొందరు యువకులు అప్రమత్తంగా స్పందించి కారును వెంబడించారు. చివరకు కొమ్మాది జంక్షన్ వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారు దిగిన వెంటనే రోడ్డుపైనే కూర్చున్నాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular