ePaper
Wednesday, April 8, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..

ఏపీ మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్లు..

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లలో ఏపీకి భారీ ప్రాధాన్యం లభించింది. తాజాగా బెంగళూరు–చెన్నై కారిడార్‌ను తిరుపతి, నాయుడుపేట మీదుగా తీసుకెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అమరావతి రెండు హైస్పీడ్ కారిడార్లకు కీలక జంక్షన్‌గా మారనుంది. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై మార్గాలు రాష్ట్రానికి కనెక్టివిటీ బూస్ట్ ఇవ్వనున్నాయి. డీపీఆర్ వచ్చే ఏడాదిలో సిద్ధమైతే ఏపీ రైల్వే మ్యాప్‌లో ఇది గేమ్‌చేంజర్ కానుంది.

  • అమరావతికి డబుల్ బూస్ట్
  • తిరుపతి–నాయుడుపేటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • అమరావతికి రెండు హైస్పీడ్ కారిడార్ల కనెక్టివిటీ
  • హైదరాబాద్–చెన్నై మార్గం గుంటూరు, నెల్లూరు మీదుగా
  • రాయలసీమకు హైదరాబాద్–బెంగళూరు కారిడార్ లాభం
  • వచ్చే ఏడాదిలో డీపీఆర్ పూర్తి చేసే లక్ష్యంకర్నూలు, పెన్ పవర్ , ఏప్రిల్ 7:

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లు రాష్ట్ర రవాణా భవిష్యత్తును మార్చే ప్రాజెక్టులుగా మారనున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, బెంగళూరు–చెన్నై కారిడార్లు రాష్ట్రంలోని పలు కీలక ప్రాంతాలను కలపనున్నాయి.తాజాగా బెంగళూరు–చెన్నై హైస్పీడ్ కారిడార్‌ను చిత్తూరు–తిరుపతి–నాయుడుపేట మీదుగా పొడిగించే ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వినతి మేరకు ఈ ఎలైన్‌మెంట్‌కు ఓకే చెప్పినట్లు రైల్వే వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట మీదుగా చెన్నైకి వెళ్లేలా ప్రతిపాదించారు. తాజా మార్పులతో నాయుడుపేట నుంచి తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, మాండ్య మీదుగా మైసూరు వరకు రెండో హైస్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. దీంతో అమరావతి రెండు హైస్పీడ్ రైలు కారిడార్లకు లింక్ అయ్యే రాష్ట్రంలోని ఏకైక ప్రధాన కేంద్రంగా అవతరించనుంది. మరోవైపు హైదరాబాద్–బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ఈ మూడు కారిడార్లు అమలులోకి వస్తే రాయలసీమ, కోస్తా, రాజధాని ప్రాంతం, తిరుపతి పుణ్యక్షేత్రం, చెన్నై–బెంగళూరు ఆర్థిక కారిడార్‌లతో ఏపీకి భారీ కనెక్టివిటీ బూస్ట్ లభించనుంది. రైల్వే శాఖ వచ్చే ఏడాదిలో డీపీఆర్ పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular