ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన జనసేన నేత గొర్లె వీర వెంకట్  

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రమేష్‌ను పరామర్శించిన జనసేన నేత గొర్లె వీర వెంకట్  

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 29: గతవారం జీకే వీధి మండలం దారకొండ ఘాట్ రోడ్డులో జరిగిన బొలెరో వాహన ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ కార్యకర్త తాడి రమేష్‌ను జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీరవెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రమేష్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జీకే వీధి పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు గడుతూరి పరమేశ్వరరావు, జీకే వీధి హెడ్‌క్వార్టర్స్ పెసా సెక్రటరీ ముక్కలి గిరిప్రసాద్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular