Homeఆంధ్రప్రదేశ్పోలవరంమారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

📰 Generate e-Paper Clip

చింతూరు, పెన్ పవర్, జూన్ 27:

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని దుర్గమాత ఆలయం సమీపంలో ప్రమాదం తృటిలో తప్పింది. రాజమండ్రి నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపక్కకు వెళ్లింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular