ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసిగనాపల్లిలో జనాభా తగ్గుదలపై అధికారుల పరిశీలన

సిగనాపల్లిలో జనాభా తగ్గుదలపై అధికారుల పరిశీలన

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూన్ 2:జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని సిగనాపల్లి గ్రామంలో 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం జనాభా పెరుగుదల లేకపోవడం, కొంత మేర తగ్గుదల కనిపించడంతో అధికారులు గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.దామనాపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ కళ్యాణ్ బాబు పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్.లక్ష్మితో కలిసి గ్రామంలో పర్యటించి స్థానికులను అడిగి జనాభా తగ్గుదలకు గల కారణాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు, కుటుంబాల స్థిర నివాస మార్పులు వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular