Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.

 

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 6:

 

నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నేడు సింహాచల శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె. తిరుమలేశ్వరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం
శ్రీ స్వామివారి మహిమాన్వితమైన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తదుపరి శ్రీ స్వామివారిని దర్శించుకుని దర్శనానంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి, శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహూకరించి సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular