Homeఆంధ్రప్రదేశ్బాపట్లరెడ్ రిబ్బన్ క్విజ్‌లో పందిళ్ళపల్లి విద్యార్థులకు ప్రథమ స్థానం

రెడ్ రిబ్బన్ క్విజ్‌లో పందిళ్ళపల్లి విద్యార్థులకు ప్రథమ స్థానం

పందిళ్ళపల్లి, అక్టోబర్ 5: జిల్లా స్థాయిలో నిర్వహించిన రెడ్ రిబ్బన్ క్విజ్ పోటీల్లో పందిళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు పృధివి షణ్ముఖేశ్వర్, ఇరపని లాస్యశ్రీ ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విద్యార్థులకు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తలమల దీప్తి, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular