Homeతెలంగాణహైదరాబాద్చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి: గద్ద క్రాంతి కుమార్

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి: గద్ద క్రాంతి కుమార్

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరి: గద్ద క్రాంతి కుమార్

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 22:

ఉప్పల్ నియోజకవర్గం నాచారం 21వ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గద్ద క్రాంతి కిషోర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాంగ్రెస్ నాయకుడు బొల్లం నరేష్ కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులకు పల్స్ పోలియో ప్రాముఖ్యతను వివరించారు.

ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ పార్వతితో పాటు స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular