Homeఆంధ్రప్రదేశ్దామనపల్లి సర్పంచ్ బరిలో సిందేరి విజయకుమారి?

దామనపల్లి సర్పంచ్ బరిలో సిందేరి విజయకుమారి?

వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం.. స్వతంత్ర అభ్యర్థిగానూ పోటీకి సిద్ధమనే ఊహాగానాలు

గూడెంకొత్తవీధి, నవంబర్ 15: దామనపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ తరఫున మాజీ సర్పంచ్ రామకృష్ణ ప్రయత్నాలు సాగిస్తుండగా, వైసీపీ సీనియర్ నాయకుడు వంతల చంటిబాబు తన సతీమణిని సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, గొడుగుమామిడి గ్రామానికి చెందిన సిందేరి రాజు సతీమణి సిందేరి విజయకుమారి కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధిష్టానం అవకాశం కల్పిస్తే పార్టీ తరఫున, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.దామనపల్లి పంచాయతీలో ఆమె సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గణనీయంగా ఉండటంతో ఈ అంశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular