గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 2:పెదవలస పంచాయతీ పరిధిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి సప్పగడ్డ కుమారి తరఫున మాజీ వైస్ ఎంపీపీ సప్పగడ్డ ఆనంద్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి కుమారికి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు వసుపరి ప్రసాదు, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

