గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 7:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం వంచుల పంచాయతీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మారుమూల గ్రామాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన గిరిజన ఓటర్లకు కొందరు అభ్యర్థులు భోజన సదుపాయం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్ల కోసం ట్రాక్టర్లపై భోజనాలను తీసుకొచ్చి పంపిణీ చేశారు. తమకు భోజన సదుపాయం కల్పించడంపై ఆదివాసీ ఓటర్లు కృతజ్ఞతలు తెలిపారు.

