ePaper
Sunday, May 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమవైఎస్ఆర్ పార్టీ డిజిటలైజేషన్‌పై రాష్ట్ర కార్యదర్శులతో చిర్ల జగ్గిరెడ్డి సమీక్ష

వైఎస్ఆర్ పార్టీ డిజిటలైజేషన్‌పై రాష్ట్ర కార్యదర్శులతో చిర్ల జగ్గిరెడ్డి సమీక్ష

📰 Generate e-Paper Clip

పెన్ పవర్ మే 16

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. రావులపాలెం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సమావేశంలో పార్టీ డిజిటలైజేషన్ కార్యక్రమాలు, వెరిఫికేషన్ ప్రక్రియలను మరింత పారదర్శకంగా వేగవంతంగా అమలు చేసే అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి కార్యకర్తకు పార్టీ కార్యక్రమాలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు మరియు పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకత్వం సూచించిన విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular