Homeఆంధ్రప్రదేశ్పోలవరంరంపచోడవరంలో స్వచ్ఛాంధ్ర ప్రత్యేక కార్యక్రమం

రంపచోడవరంలో స్వచ్ఛాంధ్ర ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

రంపచోడవరం, జూన్ 20 (పెన్ పవర్): స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన, గ్రామాల పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ చైర్‌పర్సన్ మిరియాల శిరీష దేవి, జేసీ సూరపాటి ప్రశాంత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular