Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంమానసిక ఆరోగ్య సమస్యతో తప్పిపోయిన మహిళను గుర్తించిన త్రీటౌన్ పోలీసులు

మానసిక ఆరోగ్య సమస్యతో తప్పిపోయిన మహిళను గుర్తించిన త్రీటౌన్ పోలీసులు

 

మానసిక ఆరోగ్య సమస్యతో తప్పిపోయిన మహిళను గుర్తించిన త్రీటౌన్ పోలీసులు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగష్టు 6: మానసిక ఆరోగ్య సమస్యతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మహిళను త్రీటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం, అంబేద్కర్ కాలనీ, మాధవధారకు చెందిన మైలపల్లి లక్ష్మి (63), భర్త మైలపల్లి తాతారావు, కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను 2026 జూలై 13న విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు.

చికిత్స పొందుతున్న సమయంలో 2026 ఆగస్టు 3న ఉదయం ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో 2026 ఆగస్టు 4న త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన త్రీటౌన్ పోలీసులు 2026 ఆగస్టు 6న మహిళను గుర్తించి, అవసరమైన ధృవీకరణ అనంతరం ఆమెను భర్తతో పాటు కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను కుటుంబ సభ్యులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular