Homeఆంధ్రప్రదేశ్పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి

పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు

గూడెంకొత్తవీధి,పెన్ పవర్, జూన్ 26:రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గూడెంకొత్తవీధి మండల ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు కోరారు.ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు పల్స్‌ పోలియో కార్యక్రమం ఎంతో కీలకమని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను సద్వినియోగం చేసుకొని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular