Homeఆంధ్రప్రదేశ్జిల్లా అదనపు ఎస్పీగా వై. శృతి బాధ్యతల స్వీకరణ

జిల్లా అదనపు ఎస్పీగా వై. శృతి బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ

స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 25:అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వై.శృతి స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గురువారం జిల్లా కలెక్టర్ నిషాంతి.టి‌ను కలెక్టరేట్‌లోని ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.వీరి భేటీలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసు శాఖకు సంబంధించిన పరిపాలనా అంశాలపై చర్చించినట్లు సమాచారం. జిల్లా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు అదనపు ఎస్పీ వై. శృతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular