Homeతెలంగాణఎం ఎస్ పి మండల నూతన కమిటీ ఎన్నిక

ఎం ఎస్ పి మండల నూతన కమిటీ ఎన్నిక

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25:

గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ ఇరుగు రవి అధ్యక్షతన మంగళవారం ఎం ఎస్ పి మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ జన్ను దినేష్ మాదిగ జిల్లా కన్వీనర్ కందిపాటి బిక్షపతి లు హాజరై మాట్లాడారు
ఎంఎస్‌పీని మండలంలో మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. అట్టడుగు వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అనంతరం ఎం ఎస్ పి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా కొత్తపల్లి వెంకన్న మాదిగ, మండల అధికార ప్రతినిధిగా దూడ పంగు వెంకన్న మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎం ఎస్ పి కమిటీ సభ్యులకు ఎమ్మార్పీఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కురవి మండల ఇన్‌చార్జ్ దూడపంగు శ్రీనివాసరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గిన్నారపు మురళి, తారక రామారావు, గార్ల మండల కో ఇన్‌చార్జ్ పుల్లూరు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఇల్లుటూరి శీను, కాంపటి వీరన్న, చిలుకూరి పెద్ద వెంకన్న, జల్లా శ్రీను, జిల్లా విశ్వనాథం, ఇమ్మడి వెంకన్న, ఏలూరి సాయి, అందే అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular