Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిస్పీకర్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నంలో మెగా రక్తదాన శిబిరం

స్పీకర్ పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నంలో మెగా రక్తదాన శిబిరం

రెండు శిబిరాలు ఏర్పాటు 

ఒకటి పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ ప్రాంగణం 

మరొకటి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ప్రాంగణం

నర్సీపట్నం, పెన్ పవర్ :

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం నర్సీపట్నంలో భారీ రక్తదాన శిబిరాలు (మెగా బ్లడ్ క్యాంప్) నిర్వహిస్తున్నట్లు ఆయన స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ రక్తదాన శిబిరాలను ప్రజలు, దాతల సౌకర్యార్థం రెండు కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రద్దీని నియంత్రించి కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుగా ప్రాంతాల వారీగా విభజించి ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పెద బొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసే శిబిరానికి మాకవరపాలెం మండలం, పెదబొడ్డేపల్లి, బలిఘట్టం, చెట్టుపల్లి, ధర్మసాగరం, ఓ.ఎల్.పురం గ్రామాల ప్రజలు హాజరుకావాలని సూచించారు. అలాగే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసే శిబిరానికి గొలుగొండ మండలం, నాతవరం మండలం, నర్సీపట్నం పట్టణం సహా నర్సీపట్నం మండలంలోని మిగిలిన గ్రామాల ప్రజలు విచ్చేసి రక్తదానం చేయాలని కోరారు. రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ప్రాణదాతలుగా నిలవడం ఎంతో పుణ్యకరమైన కార్యమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ తదితర కాలేజీల విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సేవా సంఘాలు, వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular