Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిజూద స్థావరంపై నర్సీపట్నం పోలీసుల మెరుపు దాడి

జూద స్థావరంపై నర్సీపట్నం పోలీసుల మెరుపు దాడి

ఆరుగురు అరెస్ట్, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

నర్సీపట్నం, పెన్ పవర్ :

అనకాపల్లి జిల్లా పోలీసు స్పెషల్ బ్రాంచ్ అందించిన సమాచారం మేరకు నర్సీపట్నం టౌన్ పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. నర్సీపట్నం టౌన్ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి నర్సీపట్నం పరిధిలోని కొత్త బయ్యపురెడ్డిపాలెం శివారులో ఈ దాడి చేపట్టారు. డబ్బులు పణంగా పెట్టి జూదం ఆడుతున్న ప్రదేశంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, జూదంలో పాల్గొంటున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.1,05,010 నగదు, 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సంబంధిత గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular