Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజువైసీపీ కంచుకోటలో జనసేన జెండా..!జీకే వీధిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

వైసీపీ కంచుకోటలో జనసేన జెండా..!జీకే వీధిలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

  • సంకడా పంచాయతీలో 300 మందికి పైగా జనసేనలో చేరికలు

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 6: వైసీపీకి బలమైన ప్రాంతంగా పేరున్న గూడెంకొత్తవీధి మండలంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పాడేరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య సమక్షంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, గ్రామస్థులు జనసేన పార్టీలో చేరారు.జీకే వీధి మండలం సంకడా పంచాయతీ అధ్యక్షుడు ఉల్లం ఈశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గోవాడ, వాసువాడ, కుమ్మరిపల్లి గ్రామాలకు చెందిన 300 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు, గ్రామస్థులు జనసేన కండువాలు కప్పుకున్నారు. ఎర్ణపల్లి, ఉసిరిగూడెం గ్రామాలకు చెందిన పలువురు కూడా పార్టీలో చేరారు. గతంలో వైసీపీకి బలమైన గ్రామంగా భావించిన వాసువాడ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు జనసేనలో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా డా. వంపూరు గంగులయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాల కోసం గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందని తెలిపారు. జనసేనలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకత్వాన్ని చూసి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలనిగంగులయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లె వీరవెంకట్, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, సీనియర్ నాయకులు వంతల సుబ్బారావు, కొయ్యం బాలరాజు, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, ప్రధాన కార్యదర్శి పోత్తూరు విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ బాబురావు, వంపూరు రమేష్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular