గూడెంకొత్తవీధి,పెన్ పవర్, సెప్టెంబర్ 11: నూతన పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు గొర్లే వీరవెంకట్ సూచించారు. జీకే వీధి సచివాలయ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్‌లకు ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్‌వీ నగర్ సచివాలయంలో ఓటీపీ సమస్యలు ఎదురవుతున్నందున, పెన్షన్ దరఖాస్తులను జీకే వీధి సచివాలయంలోనే స్వీకరించేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను కోరారు.