Homeఎడిటోరియల్గోవింద గిరి వెంకటేశ్వరుని చెంత శ్రీకృష్ణాష్టమి వేడుకలు

గోవింద గిరి వెంకటేశ్వరుని చెంత శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ఐ.పోలవరంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 5: పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఐ.పోలవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోవిందగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కృష్ణాష్టమి వేడుకలకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి అభిషేకం అనంతరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్‌కు ఆలయ అర్చకులు విశేష ఆశీర్వచనాలు అందజేశారు.

ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయని ఆలయ ఇన్‌స్పెక్టర్ అంచూరి శిరీష తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular