- గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 23:ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గూడెంకొత్తవీధి మండలం ఆర్.వి. నగర్ అటవీ రేంజ్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ అధికారి మణికృష్ణ సూచించారు.దుచ్చరపాలెం గ్రామం నుంచి సప్పర్ల రైన్ గేజ్ వరకు, గూడెం గ్రామం నుంచి మండపల్లి గ్రామం వరకు ఉన్న రిజర్వు అటవీ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగి పడే అవకాశం ఉందని తెలిపారు. అటవీ రహదారులు, చెట్ల సమీపంలో అనవసరంగా నిలవకూడదని సూచించారు. ఎక్కడైనా చెట్టు విరిగి రోడ్డుపై పడటం, రాకపోకలకు అంతరాయం కలగడం లేదా ప్రమాదకర పరిస్థితిలో చెట్లు కనిపిస్తే వెంటనే ఆర్.వి. నగర్ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.అలాగే కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, పొంగిపొర్లే వాగులు, కల్వర్టులు, ఇతర ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.సంబంధిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని రేంజ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

