ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 23:
ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్‌లోని శ్రీరామ్‌నగర్‌లో ముస్లిం నేత గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు. 28, 29వ వార్డుల పరిధిలో ఉన్న దర్గా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన గణేషుడి లడ్డూ వేలం పాటలో 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకుడు షేక్ హుస్సేన్ రూ.60,500లకు లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూ వేలం పాటలో ముస్లిం నేత పాల్గొని లడ్డూను సొంతం చేసుకోవడంతో స్థానికంగా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. కులమతాలకు అతీతంగా ముస్లిం నే సోదరభావం, పరస్పర గౌరవానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని స్థానికులు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో షేక్ హుస్సేన్ పాల్గొని లడ్డూ వేలంలో రూ.60,500లకు పాట పాడటం పలువురి ప్రశంసలు అందుకుంది. శ్రీరామ్‌నగర్‌లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

