Homeఆంధ్రప్రదేశ్నేల ఆరోగ్యంతోనే సుస్థిర వ్యవసాయం

నేల ఆరోగ్యంతోనే సుస్థిర వ్యవసాయం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 26:మండలంలోని సంకాడ రైతు సేవా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. సురేష్ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డా. వెంకటేష్ బాబు, డా. జోగారావు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పెంపు, భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను వివరించారు. శాస్త్రీయ పద్ధతులు పాటించి వ్యవసాయ భూముల ఉత్పాదకతను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వి.హెచ్.ఏ కైలాసపతి, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular