Homeఆంధ్రప్రదేశ్వాల్మీకి మహర్షి జీవిత విశేషాలపై డిగ్రీ కళాశాలలో సదస్సు

వాల్మీకి మహర్షి జీవిత విశేషాలపై డిగ్రీ కళాశాలలో సదస్సు

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు, పెన్ పవర్, అక్టోబర్ 26:ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ అధ్యక్షత వహించి, రామాయణ విశిష్టత, వాల్మీకి మహర్షి జీవిత విశేషాలను వివరించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ పాత్రుడు రామాయణంలోని మానవతా విలువలను విద్యార్థులు అలవరచుకోవాలని సూచించారు. గణితశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ గౌతమి, చరిత్ర అధ్యాపకురాలు ఇ.వి. జయలక్ష్మి, తెలుగు అధ్యాపకురాలు ఎం. రాధాకుమారి రామాయణంలోని శ్రీరాముని సుగుణాలు, ఆదర్శాలను వివరించారు. ఆంగ్ల అధ్యాపకులు పి. ఝాన్సీ, టి. మోద వెంకటలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular