ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 28 :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి: మండల అభివృద్ధి, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడాలి గోవిందరావు ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు హైదరాబాద్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు రాయపూడి రామారావు, దుడ్డేల పవన్, నాయకులు నంబూరి రామారావు, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, బట్టపోతుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

