పట్టణాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
నూతన చీఫ్ సిటీ ప్లానర్ జివిఆర్ ప్రసాద్‌కు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుభాకాంక్షలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, నవంబర్ 28:
జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబును నూతనంగా చీఫ్ సిటీ ప్లానర్ (సీసీపీ)గా బాధ్యతలు స్వీకరించిన జివిఆర్ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఉదయం సుజాతనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జివిఆర్ ప్రసాద్‌కు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ నగర పరిధిలో పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
అలాగే పెందుర్తి నియోజకవర్గ పరిధిలో పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు, పట్టణ ప్రణాళికకు సంబంధించి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సమర్థవంతంగా స్పందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పెందుర్తి జోన్ ఏసీపీ రామలింగారెడ్డి పాల్గొన్నారు.

