ePaper
Wednesday, March 18, 2026
spot_img
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినూకాలమ్మ జాతరకు సర్వం సిద్ధం

నూకాలమ్మ జాతరకు సర్వం సిద్ధం

📰 Generate e-Paper Clip

 

-ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్

​నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 16) :

రెండు రోజుల పాటు జరుగనున్న నూకాలమ్మ జాతరకు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. కొత్త అమావాస్య పురస్కరించుకుని మంగళవారం పెద్దజాగరణ, బుధవారం జాతర జరగనుంది. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చే ఉండటంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖతో పాటు ఆలయకమిటీ కూడా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇటీవల నూతన ఆలయంలో కొలువుదీరిన అమ్మవారిని దర్సించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో, ఆలయం వద్ద ఏర్పాట్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం పరిశీలించారు. ముందుగా అమ్మవారిని దర్సించుకుని, తరువాత, జాతర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణ పటిష్టంగా ఉండాలని, తాగునీరు మరియు ప్రసాదం వితరణలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని దేవదాయశాఖ, మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసు యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ​ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆలయ కమిటీ సభ్యులు మరియు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, టౌన్ సిఐ గఫూర్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, ఆలయకమిటీ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular