ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంలబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన

 

రూ.69 లక్షలతో రక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణం

రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి

గంగవరం /రాజవొమ్మంగి, పెన్ పవర్, ఏప్రిల్ 9:
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. గురువారం రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న రక్షిత త్రాగునీటి ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, కూటమి నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 60 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు సుమారు 4 కిలోమీటర్ల పైప్‌లైన్, 223 కుళాయిలు, చేతిపంపు, మోటార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.రూ.69 లక్షల వ్యయంతో చేపట్టే ఈ పనులను ఆరు నెలల్లో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు.

గ్రామంలో మిగిలిన మౌలిక వసతులను కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, ఏఎంసి చైర్మన్ లోతా లక్ష్మణరావు, సొసైటీ అధ్యక్షుడు ముప్పన కేశవ్, జనసేన మండల అధ్యక్షుడు బొదిరెడ్డి త్రిమూర్తులు, తహసిల్దార్ అల్లు సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సీతారామయ్యతో పాటు పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular