గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: గుర్తేడు మండలంలో తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరారు.మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పల్లాల బాబురావు నాయకత్వంలో పలువురు పెద్దఎత్తున పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే శిరీషాదేవి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి వచ్చే వారికి తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరినవారు క్రమశిక్షణతో పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.పార్టీలో చేరిన వారిలో కిలో త్రినాద్, కొర్రా లక్ష్మణ, కిలో జగత్రాయ్, పాంగి ఉదయ్ రావు, సాదల బాబురావు, శరంకోట గోపాల్ రెడ్డి, శరంకోట అలుమరెడ్డి, కోండ్ల కన్నపురెడ్డి, పాంగి త్రినాధ్, మరిగెల లక్ష్మమ్మ, మరిగెల కాసులమ్మ, కుమారి, బట్ట కన్నపురెడ్డి, గొలుసింగు సింగ్, మహేష్ తదితరులు ఉన్నారు. మొత్తం సుమారు 50 మంది వైకాపా నుండి తెదేపాలో చేరారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, మాజీ సర్పంచ్ గొర్లె దుస్యంతుడు, టీడీపీ యూనిట్ ఇంచార్జి శివ శంకర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మరిగెల బంతి రాజు, బూత్ ఇంచార్జ్ పసుపులేటి రాంబాబు, జర్తా రాంబాబు, కడబాల గోపి, కొర్రా రామ్మూర్తి, కడబాల దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

