ePaper
Sunday, April 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజునేలపాడు గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక 

నేలపాడు గ్రామంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుక 

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 11: రింతాడ పంచాయతీ పరిధిలోని నేలపాడు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సోమేశ్ కుమార్ (ఆల్ ఇండియా ఆదివాసి స్వయం పాలన సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు) ఆధ్వర్యంలో ప్రజలు, చిన్నారుల మధ్య ఈ కార్యక్రమాన్ని “మహనీయుల స్ఫూర్తి దినంగా” నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక విప్లవ స్ఫూర్తి ప్రదాతగా పూలే చేసిన సేవలు, త్యాగాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆదివాసుల పోరాట చరిత్రను, నేటి పరిస్థితులను గుర్తుచేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను కాపాడుకోవడానికి ఆదివాసులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.మహనీయుల స్ఫూర్తితో సమాజ మార్పు సాధ్యమని, బాల్య వివాహాలను నివారిస్తూ పిల్లలకు మంచి విద్య అందించాలని ఆయన సూచించారు.కులమతాలకతీతంగా ఐక్యతతో ముందుకు నడవాలని ఆయన ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సోమేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రజల చైతన్యం కోసం మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం అవసరమని తెలిపారు.ఈ సందర్భంగా గతంలో ఆరేళ్లపాటు పంచాయతీ కార్యదర్శిగా సేవలందించిన సోమేశ్వరరావును ప్రజలు మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకంతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ నాని బాబు,గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular