Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకాఫీ తోటల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలి: ఉద్యానవన అధికారిణి అరుణ కుమారి

కాఫీ తోటల పెంపకంపై అవగాహన కలిగి ఉండాలి: ఉద్యానవన అధికారిణి అరుణ కుమారి

గూడెం కొత్తవీధి, పెన్ పవర్, మే 26:కాఫీ తోటల పెంపకంపై గిరిజన రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జీకే వీధి మండల ఉద్యాన అధికారిణి అరుణకుమారి తెలిపారు. మండలంలోని రింతాడ పంచాయతీ కడుగుల గ్రామంలో మంగళవారం కాఫీ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ మొక్కలను నాటినప్పటి నుంచి ఫలసాయం వచ్చే వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే కాఫీ బోర్డు సిబ్బంది అధిక దిగుబడులు సాధించే విధానాలపై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నారావు, శశిప్రియ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular