ఎండాడలో చలివేంద్రం సేవలు ప్రారంభం
విశాఖపట్నం, పెన్ పవర్,
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల కు ఉపశమనం కలిగించేందుకు ఎండాడలో చలివేంద్రం (మజ్జిగ వితరణ) కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిం చారు శ్రీశ్రీశ్రీ పరమేశ్వరానందగిరి స్వామీజీ దివ్య ఆశీస్సులతో సోమవారం ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండాడ ఎస్.ఆర్. సాగర్ సౌధ అపార్టుమెంట్ ఫ్లాట్ యజమానులు, నివాసితులు, శ్రీ మంగళ కాళి పీఠం శిష్యులు మరి యు భక్తజనుల సౌజ న్యంతో ఈ సేవలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, ఎండా కాలంలో దాహార్తిని తీర్చడం అత్యంత పుణ్య కార్యమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజం లో మానవత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
చలివేంద్రం ద్వారా పాదచారులు, కార్మికులు మరియు స్థానిక ప్రజలకు మజ్జిగ పంపిణీ చేయ బడింది. కార్యక్రమంలో పలువురు భక్తులు, అపార్టుమెంట్ నివాసితులు పాల్గొని సేవలో భాగస్వాములయ్యారు.

