*వైసిపి మహిళా నేతకు అండగా వాసుపల్లి ₹.10,000/- లు సాయం*
* *హర్షం వ్యక్తం చేసిన రెల్లి సంఘం ప్రతినిధులు, కుటుంబ సభ్యులు*
* *రామలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి*
*అనారోగ్యంతో మంచానికే పరిమితమైన దక్షిణ నియోజకవర్గం 30వ వార్డ్ రెల్లి వీధిలో నివసించే వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా నాయకురాలు, రెల్లి కులానికి చెందిన దశమంతుల రామలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం స్వయంగా కలిసి పరామర్శించారు*.
హై షుగర్ కారణంగా రక్తంలో *గడ్డ కట్టి వారికోస్ వేయిన్స్ సమస్య_ వచ్చి గత కొంతకాలంగా రామలక్ష్మి మంచానికే పరిమితమయ్యారు*. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాసుపల్లి గణేష్ కుమార్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆమె వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వెంటనే ₹.10,000 /- లు ఆర్థిక సాయాన్ని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సహాయం అందిస్తామని, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స చేయించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. *ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే గా వున్నపుడు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఇటువంటి సమస్యతో ఓ మహిళ తన వద్దకు వచ్చిందన్నారు. అయితే కేజీహెచ్ లో విభాగానికి సంబంధించి డాక్టరు లేకపోవడంతో వేస్కులర్ డాక్టర్ ను నియమించి ఆయన ద్వారా వైద్యం సమకూర్చి సమస్యను పరిష్కరించామన్నారు*. ఆయన బదిలీపై పలాస ఆసుపత్రికి వెళ్లిపోయారన్న సంగతి తెలుసుకొని *”రామలక్ష్మి వైద్యం సంబంధించి ఫోన్లో మాట్లాడి వైద్యానికి అక్కడికి పంపిస్తామని నాణ్యమైన వైద్యం అందించాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆ డాక్టర్ తో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన వేస్కులర్ డాక్టర్ తన వంతు బాధ్యతగా వైద్యాన్ని సమకూరుస్తానని హామీ ఇచ్చారు*. దశమంతుల రామలక్ష్మి గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా సేవలందించిందన్నారు. పార్టీ కోసం, సమాజం కోసం ఎంతో కృషి చేశారనీ వాసుపల్లి తెలిపారు. కష్ట సమయంలో మనం అండగా నిలబడటం మన బాధ్యత అని, ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ RTI సెక్రటరీ దస్మాంతుల చిన్ని,జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు,జిల్లా RTI ప్రెసిడెంట్ వడ్డది దిలీప్,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర,జిల్లా sc వైస్ ప్రెసిడెంట్ కోన శంక, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ,సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్మ, సౌత్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చింతపల్లి లీల కృష్ణ, వార్డ్ బీసీ సెల్ ప్రెసిడెంట్ సూరకాల వేణు,వార్డ్ sc సెల్ ప్రెసిడెంట్ దస్మాంతుల సంతోషి, కారి గోవింద్, బంగారి బాబ్జి, మాదబత్తుల రమేష్,సారిపిల్లి అప్పలరాజు, త్రినాధ్ రెడ్డి,బంగారి సత్యం,పిల్లా బాలు, షైక్ సదాం,బి దుర్గ ప్రసాద్, కళ్యాణి, మని, సునీత, నాగమణి 30వ వార్డు రెల్లి సంఘం ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

