ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గొయ్యి ని పూడ్చండి మహా ప్రభో....

గొయ్యి ని పూడ్చండి మహా ప్రభో….

📰 Generate e-Paper Clip

 

కురుపాం,పెన్ పవర్, మార్చి 2 :
గరుగుబిల్లి మండలం ఖడ్గవలస జంక్షన్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి . అటు శ్రీకాకుళం వెళ్లాలన్న, ఇటు పార్వతీపురం వెళ్లాలన్న ఖడ్గవలస జంక్షన్ మీదుగా పోవాలి. నిత్యం అనేక మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.ఈ జంక్షన్ వద్ద రోడ్డు మధ్యలో గత కొద్ది రోజులు నుండి గొయ్యి ఏర్పడింది. దీనితో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.పలువురు వాహన చోదకులు గాయాలు పాలైన ఘటనలు లేకపోలేదు. దాన్ని కప్పేందుకు అధికారులు కనీస చర్యలు చేపట్టకపోవడం తో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఇప్పటికైనా గొయ్యిని కప్పించాలని ప్రజలు కోరుతున్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular