ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుసంకాడలో గ్రామ ఆరోగ్య అవగాహన కార్యక్రమం

సంకాడలో గ్రామ ఆరోగ్య అవగాహన కార్యక్రమం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 31:గ్రామ ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యంపెంపొందించేందుకు సంకాడ సచివాలయంలో మంగళవారం ఉదయం గ్రామ ఆరోగ్య, పరిశుభ్రత మరియు పోషణ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతతో పాటు ప్రభుత్వ ఆరోగ్య సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.గ్రామ స్థాయిలో ఆరోగ్యాభివృద్ధికి గ్రామ ఆరోగ్య, పరిశుభ్రత మరియు పోషణ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశగిరి నాగులమ్మ, జనసేన పార్టీ అధ్యక్షుడు ఊలం ఈశ్వర్ రావు,పిసా ఉపాధ్యక్షుడు లోచల భీమరాజు, గ్రామ ఆరోగ్య కమిటీ ప్రత్యేక అధికారి తేజ, పాల్గొన్నారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular