Homeతెలంగాణమేడ్చల్ మల్కాజ్‌గిరినాచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

నాచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

నాచారంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

శరణుఘోషతో మార్మోగిన గ్రామ వీధులు

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 23:

ఉప్పల్ నియోజకవర్గం నాచారం గ్రామంలో గురుస్వామి మేడల ఓంప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పవిత్రమైన పడిపూజలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని కోరుకున్నారు.

అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ఆద్యంతం అయ్యప్ప స్వాముల శరణుఘోషలు, భజనలు, భక్తిగీతాలతో నాచారం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు స్వామివారికి భక్తిపూర్వకంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షలోని నియమ నిష్ఠలు, భక్తి, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జీవన విధానం ప్రాధాన్యతను చాటిచెప్పారు. మహా పడిపూజలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, స్థానిక భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో గ్రామంలో భక్తిమయ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular