ePaper
Tuesday, May 26, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుపొలంలో విషసర్పం కలకలం.. రైతుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం 

పొలంలో విషసర్పం కలకలం.. రైతుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం 

📰 Generate e-Paper Clip

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 6:అల్లూరి సీతారామరాజు జీకే వీధి మండలంలోని ఎ. దారకొండ పంచాయతీ పరిధిలోని ఎ.దారకొండ గ్రామంలో ఆదివారం భారీ విషసర్పం కలకలం రేపింది. సుమారు 15 అడుగుల పొడవు గల పాము రైతుల కంటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో రైతులు టమాట పంట పొలాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విషసర్పం ఒక్కసారిగా దాడి చేయడానికి ప్రయత్నించగా, రైతు చాకచక్యంగా తప్పించుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతరం అక్కడున్న రైతులు కలిసి పామును హతమార్చారు.ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. పొలాల్లో పనిచేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు రైతులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular