ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ హాజరు రద్దు చేయాలి : సీఐటీయూ డిమాండ్

ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ హాజరు రద్దు చేయాలి : సీఐటీయూ డిమాండ్

📰 Generate e-Paper Clip

జీకే వీధి మండలంలోని దేవరాపల్లి పంచాయతీ మంగళపాలెం గ్రామంలో శనివారం సీఐటీయూ మండల కార్యదర్శి గడుతూరి సత్యనారాయణ ఉపాధి హామీ కూలీలను ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఉపాధి కూలీలకు అమలు చేస్తున్న ఫేషియల్ హాజరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఫేషియల్ హాజరు కారణంగా సెల్‌ఫోన్ సిగ్నల్ ఉన్నప్పుడే హాజరు నమోదవుతోందని, సిగ్నల్ లేకపోతే పని చేసినా హాజరు పడక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విధానాన్ని రద్దు చేయకపోతే కూలీలతో కలిసి పోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గడుతూరి పోతురాజు, బాబురావు, లవరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular